టాలీవుడ్ హీరోయిన్ లలో ఒకరైన కృతి శెట్టి చిన్న వయసులోనే ఉప్పెన సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను మొదటి సినిమాతోనే కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది.ఇక ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో హ్యాట్రిక్ హీట్ కొట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత నటించిన యాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్ సినిమాలు ఘోరమైన పరాజయాన్ని చూశాయి.ఇక దీంతో ఈ ముద్దుగుమ్మ కాస్త సతమతమవుతోందని అభిమానులు సైతం భావిస్తున్నారు.
ఉప్పెన సినిమాతో మొదలుపెట్టిన తన కెరియర్ వరుసగా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది.అయితే అందులో కొన్ని సినిమాల సక్సెస్ కాగా మరికొన్ని ఫెయిల్యూర్ గా మిగిలాయి. ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న తదుపరి చిత్రాల పైన కూడా పెద్దగా హైప్ లేకపోతోంది. ఇక అందుకు కారణం ఈమె ఎంచుకొనే కథలు ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోంది అంటూ అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇదిలావుంటే ప్రస్తుతం నాగచైతన్య హీరోగా డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వంలో ఒక సినిమాలో మాత్రమే నటిస్తోంది.
అయితే కేవలం ఈమె ఫోకస్ అంతా కూడా ఈ సినిమా పైన పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు ఒక ఏడాది పాటు కృతి శెట్టి హవా కొనసాగించిన అతి తక్కువ సమయంలో కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్గా పేరు సంపాదించింది. అయితే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల ఫ్లాపులతో ఈ ముద్దుగుమ్మకు రెమ్యూనరేషన్ లో కూడా డిమాండ్ చేయలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక కేవలం సినిమాలు ఎక్కువ చేయాలని ఉద్దేశంతో వచ్చిన కథలను గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చేజేతులారా తన కెరీయర్ని పాడు చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడైనా కథలా ఎంపిక సరిగ్గా చేసుకొని తన కెరీర్ ని ముందుకు తీసుకు వెళ్తుందేమో చూడాలి మరి..!!