ఆ క్రేజీ యంగ్ దర్శకుడి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలకృష్ణ..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో బాలకృష్ణ సరసన మోస్ట్ గార్జియస్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీ కి సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా ,  దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ గా కనిపించబోతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది.  వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో విలన్ గా నటిస్తున్న దునియా విజయ్ కి భార్య పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.


మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు సమాచారం. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ అనంతరం బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ తర్వాత యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ , బాలకృష్ణ కు ఒక కథను వినిపించగా ,  ఆ కథ బాగా నచ్చిన బాలకృష్ణ వెంటనే ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో నటించడానికి ఒకే చెప్పినట్లు ఒక వార్త అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రశాంత్ వర్మ ,  బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 టీజర్ కు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: