ఆయన సినిమా వచ్చిదంటే చాలు థియేటర్లలో మాస్ కి జాతరే అని చెప్పాలి.సినిమాలో విలన్లకు ఎగరేసి కొడుతుంటే ఫ్యాన్స్ సీట్లలో నుంచి లేచి మరీ ఎంజాయ్ చేస్తారు.ఇక ఆయన మూవీ వస్తే చాలు బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకుంటుంది. అయితే సీజన్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ తో రెచ్చిపోతుంది. వఇకపోతే యసు 60ల్లో ఉన్నప్పటికీ ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం కుర్ర హీరోలకు కూడా కష్టం. ఇక ఆయన నటసింహం నందమూరి బాలకృష్ణ. అయితే ఆయన హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కాగా ఇప్పుడు ఆ షో మూడో ఎపిసోడ్ ప్రోమో అంతకు మించిన రేంజ్ లో తెగ నవ్విస్తోంది.వివరాల్లోకి వెళ్తే.. బాలయ్యని సరికొత్తగా పరిచయం చేసిన టాక్ షో ‘అన్ స్టాపబుల్’. ఇక ఆహా ఓటీటీలో గతేడాది తొలి సీజన్ ప్రసారం కాగా… ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇదిలావుంటే తాజాగా రెండో సీజన్ మొదలుపెట్టారు. ఇక తొలి ఎపిసోడ్ కి నారా చంద్రబాబు నాయుడు- ఆయన తనయుడు లోకేష్ గెస్టులుగా వచ్చారు.అయితే రెండో ఎపిసోడ్ కి యువ హీరోలు విశ్వక్ సేన్-సిద్ధు జొన్నలగడ్డ వచ్చి తెగ సందడి చేశారు. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతమున్న హీరోయిన్లలో మీ క్రష్ ఎవరు సర్?
అని ఏకంగా బాలయ్యనే అడిగేశారు.కాగా హీరోయిన్ రష్మిక మందన్నా అని టక్కున చెప్పేశారు.అయితే మూడో ఎపిసోడ్ కి ఇద్దరు యువ హీరోలు శర్వానంద్-అడివి శేష్ వచ్చారు.ఇక వస్తూ వస్తూనే బాలయ్యకి సర్ ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చారు.అయితే స్టార్ హీరోయిన్ రష్మికతో వీడియో కాల్ చేయించారు.ఇక ఆ ఫోన్ ని బాలయ్యకి ఇవ్వగా.. వారిద్దరూ తెగ మాట్లాడుకున్నట్లు ప్రోమోలో కనిపించింది. ప్రస్తుతం ఈ ప్రోమో ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉంటూ.. ఎపిసోడ్ పై తెగ ఆసక్తి కలిగిస్తోంది.కాగా ఈ శుక్రవారం అంటే నవంబరు 4న ఆహాలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం రష్మిక, పాన్ ఇండియా హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.అయితే బాలయ్య కూడా మాస్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అంతేకాదు ఎవరైనా దర్శకుడు ఈ ఇద్దరి కాంబోలో ఏమైనా మూవీ సెట్ చేస్తాడేమో చూడాలి?.!!