తమిళ
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విష్ణు విశాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తమిళ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న విష్ణు విశాల్ కొంత కాలం క్రితం "ఎఫ్ ఐ ఆర్" అనే
మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను కూడా పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన "ఎఫ్ ఐ ఆర్"
మూవీ తెలుగు ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించింది. ఇది ఇలా ఉంటే "ఎఫ్ ఐ ఆర్"
మూవీ తెలుగు లో ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై రవితేజ సమర్పణలోనే విడుదలైంది. ఇలా "ఎఫ్ ఐ ఆర్"
మూవీ తో తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న విష్ణు విశాల్ ప్రస్తుతం మట్టి కుస్తీ అనే
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ ని కూడా తెలుగు లో విడుదల చేయనున్నారు. చెల్లా అయ్యావు ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఐశ్వర్య లక్ష్మి ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , జస్టిన్ ప్రభాకరన్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా మట్టి కుస్తీ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా మట్టి కుస్తీ
మూవీ యూనిట్ ఈ
సినిమా ఫస్ట్ లుక్
పోస్టర్ విడుదల తేదీని మరియు సమయాన్ని ప్రకటించింది. మట్టి కుస్తీ
మూవీ ఫస్ట్ లుక్ ను 2
నవంబర్ 2022 వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మట్టి కుస్తీ
మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. మట్టి కుస్తీ
మూవీ ని
తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.