మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం ఆచార్య మరియు గాడ్ ఫాదర్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఆచార్య మూవీ ప్రేక్షకులను నిరుత్సాహపరచగా , గాడ్ ఫాదర్ మూవీ ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి , బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తూ ఉండగా , శృతి హాసన్ ఈ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా , మాస్ మహారాజా రవితేజ ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం టైటిల్ టీజర్ ను విడుదల చేయగా , ఈ టైటిల్ టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించడం , అదిరిపోయే రేంజ్ మాస్ డైలాగ్ లను చెప్పడంతో , ఈ మూవీ టైటిల్ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే వాల్తేరు వీరయ్య మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
కాకపోతే ఈ మూవీ ని సంక్రాంతి కి ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనేది మాత్రం ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించ లేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య మూవీ ని 11 జనవరి 2023 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి , మాస్ మహారాజ రవితేజ వాల్తేరు వీరయ్య మూవీ లో కలిసిన నటించడం , ఈ మూవీ లో చిరంజీవి వెంటేజీ లుక్ లో కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనే వార్తలు రావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.