బాలకృష్ణ షో పై మొదలైన నెగిటివ్ కామెంట్స్ !
ఈ షోలో శర్వానంద్ అడవి శేషులు బాలయ్యను ఉద్దేశించి అడిగిన ప్రశ్నలు మరీ నాసిరకంగా ఉన్నాయి అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శర్వానంద్ బాలయ్య పై వేసిన కొన్ని ప్రశ్నలు బాలకృష్ణ అభిమానులకు కూడ ఏమాత్రం నచ్చలేదు అని తెలుస్తోంది.
మీరు వంద సినిమాల వరకు చేసుంటారు అందులో 25 నుంచి 30 మంది హీరోయిన్ లతో చేసి వుంటారు కదా? అని శర్వా అడిగితే అడివి శేషు దాన్ని వర్ణిస్తూ వక్రీకరిస్తూ చేసుంటారా అని అడగడం దానికి బాలయ్య ఇవన్నీ బీ సెంటరోడి తెలివితేటలు అంటూ కౌంటర్ ఇవ్వడం పరిశీలించిన వారికి ఇలాంటి నాసిరకం డైలాగ్స్ బాలకృష్ణ షోలో పెట్టి పాపులర్ చేయాలనీ అనుకుంటున్నారా అన్న సందేహాలు వస్తాయి. ఇదే షోలో బాలయ్య ‘ఈమెతో మాత్రం కిస్ వద్దురా బాబు అనుకునే హీరోయిన్ ఎవరు అడివి శేష్ ను అడిగినప్పుడు శేషు వెంటనే దానికి పూజా హెగ్డే అని చెప్పడం మరీ అతిగా ఉంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
ఈ షోని హోస్ట్ చేస్తున్నది బాలకృష్ణ కాబట్టి అతడి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అతిధులు అడిగే ప్రశ్నలు డిజైన్ చేస్తే బాగుంటుంది అని మరికొందరు బాలయ్య అభిమానుల అభిప్రాయం. అంతేకాదు ఈ షోలో కేవలం యంగ్ హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు నాగార్జున చిరంజీవి లాంటి టాప్ హీరోలతో కూడ బాలయ్య షో ఉంటే బాగుంటుంది అని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు..