సమంత లేకుండానే యశోద సినిమా సక్సెస్ అవుతుందా..!!

Divya
సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రంగా నటిస్తున్న చిత్రం యశోద. ఈ సినిమా ఈనెల 11వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా డైరెక్టర్ హరి హరీష్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ ఏందనే విషయం తాజాగా విడుదలైన టీజర్ ని చూస్తే మనకి అర్థమవుతుంది. సరోగసి బ్యాక్ డ్రాప్ లో యశోద సినిమా వస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో సమంత సన్నివేశాలు యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ ఈ సినిమాకి స్పెషల్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేయడం మరింత హైలైట్ గా మారనుంది.

ప్రస్తుతం సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉన్నది. ఇక ఈ వ్యాధి ట్రీట్మెంట్ కోసం దాదాపుగా కొన్ని నెలలపాటు సమంత ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉన్నది. తను పూర్తిగా కోలుకోవాలి అంటే కనీసం అర్థ సంవత్సరమైన పడుతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇలాంటి సమయంలో సినిమా రిలీజ్ చేయడం అంటే అదొక సాహసం అని చెప్పవచ్చు. అయితే సమంత రాకుండా యశోద సినిమా ప్రమోషన్స్ ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు చిత్రం బృందం.

అంతేకాకుండా ఆల్రెడీ సినిమా డేట్ ని కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఈ సినిమా విడుదల సమయం లో వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.సమంత ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటే ఈ సినిమా ఆడియన్స్ లోకి వెళ్లే అవకాశం ఉందని పలువురు నెట్టిజాన్లు సైతం తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అదే జరిగే ఛాన్స్ లేదు కాబట్టి యశోద సినిమా పరిస్థితి ఏంటని తమంత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ చిత్రం కూడా పాత ఇండియా వైడ్ గా విడుదల చేస్తున్నారు. మరి యశోద సినిమా సమంత లేకుండా హిట్ కొడుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: