ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానున్న "ఊర్వశివో రాక్షసివో" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ హీరోగా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న నటులలో ఒకరు అయినటు వంటి అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు శిరీష ఇప్పటికే అనేక మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే అల్లు శిరీష్ "శ్రీరస్తు శుభమస్తు" అనే మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , ఈ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్నాడు.


ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ "ఊర్వశివి రాక్షసివో" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బ్యూటిఫుల్ గర్ల్ అను ఇమాన్యుయల్ , అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా నటించగా ,  రాకేష్ శశి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని రేపు అనగా నవంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారు.


దానితో ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.
నైజాం : 100 ప్లస్ .
సీడెడ్ :  45 .
ఆంధ్ర :  130.ప్లస్ .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఊర్వశివో రాక్షసివో మూవీ 275 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఊర్వశివో రాక్షసివో మూవీ 420 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ తో అల్లు శిరీష్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: