పాపం: నోరు జారిన కృతి శెట్టి.. ట్రోల్స్ చేస్తున్న నేటిజన్స్..!!

Divya
టాలీవుడ్ లో గత సంవత్సరం యువ హీరోయిన్లలో ముందు వరుసలో ఉండే హీరోయిన్ ఎవరంటే టక్కున కృతి శెట్టి పేరు వినిపించేది. తను నటించిన మొదటి చిత్రం ఉప్పెనతోనే ఓవర్ నైట్ కే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే తన అందం నటనతో ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత దివారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో బారి డిజాస్టర్లను చవిచూసింది. దీంతో ఈమె కెరియర్ కూడా కాస్త అటు ఇటుగా మారిపోయింది అని అభిమానులు భావిస్తూ ఉన్నారు.

కేవలం కృతి శెట్టి చేతిలో నాగచైతన్యతో నటిస్తున్న  ఒక్క సినిమాలో నటిస్తోంది. ఈమె కెరియర్ అంతా ఈ సినిమా పైన ఆధారపడిందని చెప్పవచ్చు. ఇక తరచూ సోషల్ మీడియాలో తన అందాలను కూడా ప్రదర్శిస్తూ మరింత ఆకట్టుకునేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మొదట ఎంతో పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి ఆ తర్వాత అందాల ఆరబోతకు కూడా సై అంటూ సిగ్నల్స్ ఇచ్చేస్తూ ఉన్నది. ఇలా ఫోటోలతోనే సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

 ఇదంతా ఇలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారుతోంది. ఇటీవల కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ పొరపాటున నోరు జారి ఒక బూతు పదం మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ ముద్దుగుమ్మని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజులలో తను ఎక్స్పోజింగ్ చేయడానికి అయినా రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి అయినా సిద్ధమే అన్నట్లుగా తెలియజేసినట్లు సమాచారం. మరి ఈ ముద్దుగుమ్మ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: