సింగిల్ టేక్ లో ఐదు పేజీల డైలాగ్ చెప్పిన వరలక్ష్మి శరత్ కుమార్..!?

Anilkumar
వరలక్ష్మి శరత్ కుమార్‌ ఈమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. ఇక ఈ మధ్య తెలుగునాట గట్టిగా వినిపిస్తున్న పేరు ఈమెది... ఇకపోతే వరలక్ష్మి శరత్కుమారు  'క్రాక్‌'లో తన పాత్రకు మంచి పేరు వచ్చింది.ఇదిలావుంటే ఇక ఈమె  'నాంది'లో వరలక్ష్మి పాత్ర గుర్తుండిపోతుంది.అయితే ఈ రెండు సినిమాల తరవాత.. వరుసగా ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ఇక  ఇప్పుడు తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ బిజీ అయిపోయింది ఈమె .అయితే  అందుకే తన మకాం చెన్నై నుంచి హైదరాబాద్ కు మార్చేసింది .ఇదిలావుంటే  ప్రస్తుతం  నటసింహం నందమూరి బాలకృష్ణ  హీరోగా నటిస్తున్న


 'వీర సింహారెడ్డి'లో కీలక పాత్ర పోషిస్తోంది.ఇక  ఈ సినిమా తన కెరీర్‌కి ఓ మేలిమి మలుపు అని భావిస్తోంది వరలక్ష్మి.అయితే  ఈ సినిమాలో 5 పేజీల డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పేసి.కాగా   నటసింహం నందమూరి బాలకృష్ణయ్య తో పాటు చిత్రబృందానికీ షాక్ ఇచ్చిందట వరలక్ష్మి.ఇకపోతే  నటసింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహారెడ్డి'కి సంబంధించిన ఓ ఎమోషనల్ సీన్‌ని బాలయ్య - వరలక్ష్మిల మధ్య ఇటీవలే తెరకెక్కించారు.అయితే  ఇందులో వరలక్ష్మికి ఏకంగా 5 పేజీల డైలాగ్ ఉంది. అంతెందుకు దాదాపు మోనో యాక్షన్‌లాంటిది.


ఇక  నటసింహం నందమూరి బాలకృష్ణయ్య ముందు ఈ డైలాగ్ చెప్పాలి. వరలక్ష్మికి తెలుగు అంతంత మాత్రమే వచ్చు.అంతేకాదు  పైగా ముందున్నది  నటసింహం నందమూరి బాలకృష్ణ. కాబట్టి.. ఈ సీన్ పూర్తయ్యే సరికి ఓ రోజు పడుతుందని అంతా ఫిక్సయిపోయారు. వరలక్ష్మి మాత్రం ఈ 5 పేజీల డైలాగ్ నీ సింగిల్ టేక్‌లో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.ఇక  డైలాగ్ పూర్తవగానే యూనిట్లోని సభ్యులంతా చప్పట్లు కొట్టారట.అయితే   నటసింహం నందమూరి బాలకృష్ణ తో సహా. థియేటర్లో కూడా ఈ సీన్ క్లాప్ కొట్టిస్తుందని ఇన్ సైడ్ వర్గాల టాక్‌.ఇక  ఈ సంక్రాంతికే 'వీర సింహారెడ్డి' విడుదల కాబోతోంది.కాగా  సమంత నటించిన 'యశోద'లోనూ వరలక్ష్మి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈనెల 11న 'యశోద' విడుదల అవుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: