మొదటి సారి సమంత వ్యాధిపై నోరు విప్పిన చైతూ..?

Anilkumar
స్టార్ హీరోయిన్ సమంత ప్రజెంట్ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.ఇక  ఇన్నాళ్లు సోషల్ మీడియాకి దూరంగా ఉన్న సమంత అమెరికాలో ఏదో అందం కోసం ట్రీట్మెంట్ తీసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.అయితే మరికొన్ని రోజుల తర్వాత ఆమె గర్భసంచి తీసేసుకుంది అంటూ కొత్త పుకార్లు వచ్చాయి.. తర్వాత ఇవేది కాదు ఆమె ఒక స్కిన్ ఎలర్జీ కారణంగా బాధపడుతుందని .అయితే ఈ కారణంగానే అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని వార్తలు వినిపించాయి.

ఇక  ఇవన్నీ నిజం కాదు అంటూ సమంత పర్సనల్ మేనేజర్ చెప్పుకొచ్చాడు .రీసెంట్గా స్వయంగా సమంతనే తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది . ఇక ఈ క్రమంలోనే టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ సినీ సెలబ్రిటీస్ ఆమె బెస్ట్ ఫ్రెండ్స్ శ్రేయోభిలాషులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు .  ఆమె మాజీ భర్త అయినా నాగచైతన్య మాత్రం ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు . ఇక మనకు తెలిసిందే సమంత - నాగచైతన్య ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని మనస్పర్ధలు కారణంగా ఏడాది క్రితం విడాకులు తీసుకున్నారు .

ఇదిలావుంటే ఈ క్రమంలోనే ఇద్దరు ఎవరి లైఫ్ వారిది అంటూ జీవిస్తున్నారు .  ఇలాంటి టైం లో కూడా నాగచైతన్య ..సమంత వ్యాధిపై స్పందించకపోవడం ఏంటా అంటూ జనాలు చర్చించుకున్నారు .  అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య .. సమంతతో ఆల్రెడీ మాట్లాడారట .ఇక  సమంత ఆరోగ్యం బాగోలేని విషయం నాగచైతన్యకు ముందే తెలుసట. ఈ క్రమంలోనే ఆమెకు మయోసైటిస్ జబ్బు ఉన్న విషయం సమంత సోషల్ మీడియాలో చెప్పక ముందే నాగచైతన్య ఆమెతో మాట్లాడి ఆమె బాగోగులు తెలుసుకున్నారని.. ఓ న్యూస్ వేగంగా వైరల్ గా మారింది. అంతేకాదు ఇక  సామ్ కూడా నాగచైతన్య మాటలకు సాఫ్ట్ గా రియాక్ట్ అయిందని ..ఇద్దరు చాలా కూల్ గా ఫ్రెండ్షిప్ బేస్డ్ గా మాట్లాడుకున్నారు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీంతో అక్కినేని - సమంత ఫ్యాన్స్ మళ్ళీ ఒకటైనట్లు తెలుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: