కన్నడ
సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి
రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
రిషబ్ శెట్టి
కన్నడ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో మంచి విజయవంత మైన సినిమాలలో నటించి
కన్నడ సినిమా ఇండస్ట్రీ లో నటుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇలా
కన్నడ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న ఈ నటుడు తాజాగా కాంతారా అనే
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
రిషబ్ శెట్టి హీరోగా నటించిన మాత్రమే కాకుండా ఈ
మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు.
భారీ అంతలాల నడుమ ఈ
మూవీ సెప్టెంబర్ 30 వ తేదీన
కన్నడ భాషలో విడుదల అయింది. ఈ
మూవీ కి
కన్నడ భాషలో బ్లాక్ బాస్టర్ టాక్ లభించడంతో అద్భుతమైన కలెక్షన్ లు లభించాయి. దానితో ఈ
మూవీ ని
అక్టోబర్ 15 వ తేదీన తెలుగు భాషలో కూడా విడుదల చేశారు. ఈ
మూవీ ని తెలుగు లో
గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశాడు. ఈ
మూవీ కి తెలుగు లో కూడా
బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఇప్పటికీ కూడా ఈ
మూవీ కి
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా కాంతారా
మూవీ హీరో మరియు దర్శకుడు అయినటు వంటి
రిషబ్ శెట్టి
సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. సినిమాల్లోకి రాక ముందు చాలా గడ్డుకాలం ఎదుర్కొన్నాను అని , కనీస అవసరాల కోసం వాటర్ క్యాన్లు అమ్మినట్లు ఈ
హీరో గుర్తు చేసుకున్నాడు. అలాగే హోటల్లో పని చేశాను అని కూడా
రిషబ్ శెట్టి చెప్పుకొచ్చాడు. కాంతారా
మూవీ లో
రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ
హీరోయిన్ గా నటించింది. ఈ ఇద్దరు జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.