బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాల పాటు
మూవీ లకు కాస్త దూరంగా ఉన్న
షారుఖ్ ఖాన్ ప్రస్తుతం వరస
మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం
షారుఖ్ ఖాన్ తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
జవాన్ అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ
మూవీ లో
షారుఖ్ ఖాన్ సరసన
లేడీ సూపర్ స్టార్ నయన
తార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ప్రియమణి ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం
జవాన్ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా షారుక్ ఖాన్ , అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న
జవాన్ మూవీ చిన్న వివాదంలో చిక్కుకుంది.
జవాన్ మూవీ ని కాపీ కొట్టి తీశారు అంటూ మాజీ
నిర్మాత మాణికం నారాయన్ దర్శకుడు
అట్లీ పై ఆరోపణలు చేశాడు.