అభిమానం ఉంటే అలా చేయండి అంటున్న వరలక్ష్మి..!!

Divya
ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. మొదట హీరోయిన్గా ఇమే ప్రయత్నించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఈమధ్య పలు సినిమాలలో విలన్ క్యారెక్టర్లలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సినిమాలలో పలు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగానే మరొకవైపు లేడీ సినిమాలలో నటిస్తూ ఉంది.
తెలుగు, తమిళ్ ,కన్నడ వంటి భాషలలో కూడా కీలకమైన పాత్రలలో పలు సినిమాలలో నటిస్తోంది. ఈమె నటించిన యశోద చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై కృష్ణ ప్రసాద్ నిర్మించిన వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం నవంబర్ 11వ తేదీన తెలుగు, తమిళ్ ,కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషలలో విడుదల చేస్తూ ఉన్నారు. ఇక సమంతకి మయో సైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న కారణంగా సమంత ఈ సినిమా ప్రమోషన్లలో దూరంగా ఉన్నది. కానీ ఈ రోజున సమంత సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది.

ఈ సందర్భంగా యశోద సినిమాకు సంబంధించి వరలక్ష్మి తెలియజేస్తూ ఈ క్రమంలో సినీ తారల వ్యక్తిగత జీవితాల గురించి తెలియజేసింది.వరలక్ష్మి మాట్లాడుతూ ఇప్పుడు అంతా సెలబ్రెటీల్ లైఫ్ లోని సరోగసి గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఎవరికివారు తమ లైఫ్ కి సంబంధించిన విషయాలను పక్కనపెట్టి ఇతరుల లైఫ్ లోకి తొంగీ చూస్తూ ఉన్నారు. సినీ తారల పట్ల అభిమానం ఉంటే వారి సినిమాను చూడండి ఎలా ఉందో చెప్పండి చాలు అంతేకానీ వారి పర్సనల్ విషయాలను గురించి మాట్లాడవద్దు ఆ హక్కు ఎవరికీ లేదని తెలియజేసింది వరలక్ష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: