సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను యాక్షన్ సన్నివేశాలతో ప్రారంభించారు. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇప్పటికే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కావలసి ఉండగా , సూపర్ స్టార్ మహేష్ బాబు విదేశాలకు వెళ్లడంతో ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కావడం కాస్త ఆలస్యం అవుతుంది.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే మహేష్ బాబు విదేశాల నుండి ఇండియాకు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ మూడవ వారం నుండి ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండవ షెడ్యూల్ షూటింగ్ ను ఎక్కువ రోజులు మూవీ యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ షూటింగ్ లో పూజా హెగ్డే కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మహేష్ బాబు మరియు పూజా హెగ్డే లపై పెళ్లి కి సంబంధించిన సన్నివేశాలను చిత్రకరించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాక పోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల కాపడం కష్టమే అని కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు , రాజమౌళి దర్శకత్వం లో తేరకేక్కపోయే మూవీ లో నటించబోతున్నాడు.