పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తరువాత ప్రభాస్ ఎంచుకునే సినిమాలు పట్ల ఆయన అభిమానులు ఎంతో నిరాశను వ్యక్తపరుస్తున్నారు. దానికి తోడు క్వాలిటీ లేని సినిమాలను చేస్తూ వారి ఆగ్రహానికి కూడా ఆయన లోన్ అవుతున్నారు. ఇటీవలే ఆయన బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆది పురుష్ సినిమా యొక్క టీజర్ విడుదల కాగా అది పేలవంగా ఉండడంతో అభిమానులు అందరూ కూడా పెదవి విరిచారు. దాంతో ప్రభాస్ పై అభిమానులు కాస్త మండిపడుతున్నారు
కోటానుకోట్ల రూపాయలు పెట్టే నిర్మాతలు ఉండగా అద్భుతాలు సృష్టించే దర్శకులు ఉండగా ఈ విధంగా నాసిరకపు సినిమాలు చేయడం ఏంటి అని ప్రభాస్ పై అభిమానులు మండిపడుతున్నారు. వాస్తవానికి అది పురుష్ టీజర్ చూసిన తర్వాత అందరూ ఇదే విధంగా అనుకున్నారు. 3డిలో సినిమా రూపొందుతుంది కాబట్టి అందులో ఈ చిత్రం బాగా ఉంటుంది అని వారు చెప్పారు. అయితే దీని పట్ల అభిమానులు సాటిస్ ఫై అవటం లేదు. ఎలా చూసిన కూడా సినిమా బాగుండాలి లేదంటే ప్రభాస్ కెరియర్‌కి అది పెద్ద మచ్చగా మారుతుంది అని వారు చెబుతున్నారు
ప్రభాస్ అభిమానుల మాట వినడు కాబట్టే మరొకసారి ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ మొదలు పెట్టాలని చెప్పాడు. అందుకే ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతున్న కూడా దానిని ఆపేసి మరి ఆరు నెలలు వాయిదా వేసి మరి ఈ సినిమాకు రీ ఎడిట్ చేయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈ సినిమా ద్వారా ఎలా కం బ్యాక్ చేస్తాడో చూడాలి. బాహుబలి సినిమా తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు కూడా భారీ స్థాయిలో ప్లాపులు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేసే సినిమా మంచి విజయం అందుకోవాలి కాబట్టి ప్రభాస్ ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత కూడా ఆయన చేసే చిత్రాల పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తున్నాడట