టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ సేన్ ఇప్పటికే అనేక విజయవంత మైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో ఓరి దేవుడా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించగా , మిథాలీ పాల్కర్ ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా నటించింది. అశ్విత్ మరిముత్తు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.
ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో మంచి కలెక్షన్ లు ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఇది ఇలా ఉంటే యంగ్ హీరో విశ్వక్ సేన్ కొన్ని రోజుల క్రితం నటుడు అర్జున్ సర్జా దర్శకత్వం లో ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఓపెనింగ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా విచ్చేశాడు. ఈ మూవీ ఓపెనింగ్ కూడా అయిన తర్వాత విశ్వక్ సేన్ కు మరియు అర్జున్ సార్జా కు చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఈ విషయాన్ని అర్జున్ సర్జ తాజాగా అధికారికంగా ప్రకటించాడు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అర్జున్ సర్జా విశ్వక్ సేన్ తో చేయించాలి అనుకున్న పాత్రను మరో టాలీవుడ్ యంగ్ హీరోతో చేయించుకోవాలి అని అనుకుంటున్నట్లు , అందుకోసం ఆ హీరో డేట్ ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... అర్జున్ సర్జ , విశ్వక్ సేన్ కోసం అనుకున్న కథను టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తో తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నట్లు , అందులో భాగంగా ప్రస్తుతం అర్జున్ , శర్వానంద్ డేట్ ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.