టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషనల్‌లో తెరకెక్కుతున్న సూపర్ ప్రాజెక్ట్ 'SSMB28'. ఇక ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఇక ఈ సినిమాను ఫుల్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ అంశాలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన స్టైల్ లో ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్‌తో చాలా అందంగా కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ను అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన మూవీ యూనిట్, రెండో షెడ్యూల్‌ను మాత్రం మహేష్ తల్లిగారు మరణించడం వల్ల ఇంకా మొదలుపెట్టలేదు. అందువల్ల ఈ రెండో షెడ్యూల్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా రెండో షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై చిత్ర యూనిట్ ఓ క్లారిటీకి వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది.
నవంబర్ నెలాఖరు దాకా ఈ షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇప్పటికే వెకేషన్ నుండి తిరిగి వచ్చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర చాలా అల్టిమేట్‌గా డిజైన్ చేశాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన చేసే పర్ఫార్మెన్స్ అభిమానులకు మంచి ట్రీట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే మరోసారి హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా అలాగే హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈసారైనా అనుకున్న సమయానికి మహేష్-త్రివిక్రమ్ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తారో లేదో అనే సందేహం సినీ వర్గాల్లో నెలకొంది.