టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఇటీవల టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ ఆర్ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయి గుర్తింపును పొందిన సంగతి మన అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ . ఫిల్మోగ్రఫిలో అండర్ రేటెడ్ మూవీస్‌లో ‘బాద్షా’ ఒకటి. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013లో రిలీజై యావరేజ్‌గా నిలిచింది.ఇక రిలీజ్ రోజు పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా,
బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు సాధించలేకపోయింది. అయితే శ్రీనువైట్ల అప్పటికే ‘దూకుడు’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇకపోతే దూకుడు తర్వాత ఈ చిత్రం తెరకెక్కడంతో ప్రేక్షకులలో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే ఇక ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కాగా తారక్ కూడా ఒక ఇంటర్వూలో రిలీజ్‌కు ముందు బాద్షా చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్టవుతుందని అనుకున్నాని చెప్పాడు. అయితే ఇక రిలీజ్ రోజు ఫలితం తేడా రావడంతో నమ్మలేకపోయానని చెప్పాడు.అయితే ఫలితం ఎలా ఈ సినిమాలో కామెడీ సీన్స్‌కు సెపెరేట్ ఫ్యాన్స్ ఉన్నారు.
ఇక బ్రహ్మనందం కామెడీని రిపీటేడ్గా చూస్తుంటా. ఇక ఇదిలా ఉంటె ఈ చిత్రానికి బ్రహ్మనందంకు బెస్ట్ కామెడీయన్ అవార్డు కూడా వచ్చింది.అయితే ఇదిలా ఉంటే ఈ సినిమా మళ్లీ రీ-రిలీజ్ కాబోతుంది.ఇక నవంబర్ 19న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ కానుంది. అయితే ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాడు.ఇకపోతే యాక్షన్ కామెడీ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పరమేశ్వరా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బండ్ల గణేస్ నిర్మించాడు.కాగా థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది..!!