మహేష్ బాబు తొలి ప్రేమ ఎవరితోనో తెలుసా...???
పాలమీగడ లాంటి బుగ్గలతో ఉన్న మహేశ్ అంటే మహిళా ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఇక ఇండస్ట్రీలోని హీరోయిన్లంతా ఒక్కసారైనా మహేశ్ పక్కన నటించాలని కోరుకుంటారు. సినిమా సంగతి ఎలా ఉన్న మహేశ్ తో కలిసి పనిచేయడం అంటే అదృష్టమే. అయితే ఎక్కువగా లేడీస్ ను పట్టించుకోని మహేశ్ ఓ స్టార్ హీరోయిన్ పై అభిమానం పెంచుకున్నాడు. చదువుకునే రోజుల్లో నుంచే అమెంటే మహేశ్ కు ఇష్టం..
అమె ఎవరో కాదు.. విజయశాంతి. ఒకప్పటి స్టార్ నటి. విజయశాంతి సినిమాలంటే మహేశ్ కు చాలా ఇష్టం. ఆమె సినిమాలను తప్పకుండా చూసేవారు. విజయశాంతి, కృష్ణలు కలిసి కొన్ని సినిమాలను చేశారు. ఆ సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాయి. ఇందులో కొడుకు దిద్దిన కాపురం ఒకటి. ఈ సినిమాలో మహేశ్ బాలనటుడిగా కూడా నటించారు. ఈ సమయంలో విజయశాంతి అంటే మహేశ్ కు ఎనలేని అభిమానం పెరిగింది.
ఎంతలా అంటే విజయశాంతి మాటల్లో కుటుంబ సభ్యులు పలకరించినట్లే ఉండేదట. ఆమెతో మాట్లాడితే ఇంట్లో
వాళ్లను పలకరించినట్లే అనిపించేదట. అందుకే షూటింగ్ విరామ సమయంలో మహేశ్ ఆమెతో సరదాగా ముచ్చటించేవారు. కృష్ణ కూడా వీరి సాన్నిహిత్యాన్ని చూసి ముచ్చటపడేవారు. ఇప్పుడు మహేశ్ స్టార్ హీరో అయ్యాడు. ఎప్పటి నుంచి విజయశాంతి తన సినిమాలో నటించాలని కోరుకుంటున్నాడట. ఇన్నాళ్లకు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మరోసారి కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు.మహేశ్ చాలా బిడియంగా ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అలాంటిది విజయశాంతితో ఉన్న సాన్నిహిత్యం చూసి మహేశ్ సోదరీమణులు కూడా ఆసక్తిగా గమనించేవారు. అందుకే మహేశ్ తొలిప్రేమ ఆమెపైనే చూపించారని అంటూంటారు.