ఏ హీరోయిన్ చేయకూడని తప్పు చేసిన ఇలియానా. ఇప్పటికీ కుళ్ళి కుళ్లి ఏడుస్తుందట...!!!

murali krishna
హీరోయిన్ కావడం చిన్న విషయం కాదు. దానికి ఎవ్వరికీ లేని అదృష్టం ఉండాలి. చెప్పలేనంత టాలెంట్ ఉండి ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేసినా కనీస గుర్తింపుకు నోచుకోని హీరోయిన్స్ ఎందరో.చాలా మంది అమ్మాయిల జీవితాలు అవకాశాల కోసం ఎదురు చూడటంతోనే ముగిసిపోతాయి. కొందరు హీరోయిన్స్ మాత్రం మంచి ఆరంభం లభించినా దాన్ని ఉపయోగించుకోలేరు. తప్పుడు నిర్ణయాలతో చేజేతులా కెరీర్స్ నాశనం చేసుకొని తర్వాత కూర్చొని ఏడుస్తున్నారు.ఒకప్పటి టాప్ హీరోయిన్ ఇలియానా తప్పటడుగులు వేసి చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంది. ఆమె చేసిన అతిపెద్ద తప్పు పాతాళానికి తొక్కేసింది. ఏ హీరోయిన్ కూడా చేయ కూడని తప్పు ఇలియానా చేసింది. మోడల్ అయిన ఇలియానాను వై వి ఎస్ చౌదరి వెండితెరకు పరిచయం చేశారు. దేవదాసులో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఇదే సినిమాతో రామ్ పోతినేని హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ భారీ విజయం సాధించింది.
ఇలియానా మేకర్స్ కంట్లో పడింది. రెండో మూవీకే సూపర్ స్టార్ మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. దర్శకుడు పూరి జగన్నాథ్ పోకిరి చిత్ర హీరోయిన్ గా ఇలియానాను ఎంపిక చేశాడు. ఇక పోకిరి సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండో మూవీతోనే ఇలియానా ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది. ఇక టాలీవుడ్ లో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ క్యూ కట్టాయి. పొరుగున ఉన్న కోలీవుడ్ లో కూడా ఆమె హవా మొదలైంది.దర్శకుడు శంకర్ విజయ్ కి జంటగా తీసుకున్నారు. స్నేహితుడు మూవీలో విజయ్-ఇలియానా కలిసి నటించారు.సక్సెస్ ట్రాక్ లో కెరీర్ పరుగు తీస్తుండగా… ఇలియానా తీసుకున్న ఒక్క నిర్ణయం తలక్రిందులు చేసింది. బాలీవుడ్ లో ఏదో పొడిచేయాలని 'బర్ఫీ'లో నటించారు. కొన్నాళ్ళు టాలీవుడ్ కి ముఖం చాటేసి వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేశారు. ఇలియానా నటించిన ఒక్క చిత్రం కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. దాదాపు ఆరేళ్ళు తెలుగు పరిశ్రమకు ఇలియానా దూరమైంది. దీంతో ఇక్కడి ప్రేక్షకులు ఆమెను మర్చిపోయారు. అలాగని బాలీవుడ్ లో నిలదొక్కుకుందా అంటే అదీ లేదు.
హిందీలో నటించిన చిత్రాలేవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. అక్కడ కూడా ఆఫర్స్ తగ్గిపోయాయి. అడపాదడపా అవకాశాలతో నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018లో అమర్ అక్బర్ ఆంటోని మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ చిత్రం డిజాస్టర్ కాగా ఇలియానాకు తెలుగులో పూర్తిగా దారులు మూసుకుపోయాయి. కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న సామెత మాదిరి బాలీవుడ్ మోజులో ఇలియానా టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కెరీర్ కోల్పోయింది. తాను చేసిన ఈ తప్పు తలచుకుని ఇలియానా చాలా బాధపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: