పవన్ కళ్యాణ్ ఆ సినిమా లేనట్టేనా..?

Divya
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. అభిమానుల ఒత్తిడి కారణంగా మూడేళ్ల విరామం తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను బాగానే అలరించారు. ఇక అదే సమయంలో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మొదటిసారి పాన్ ఇండియా లేవలో తెరకెక్కిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా అండర్ ప్రాసెస్ లో ఉండంగానే భవదీయుడు భగత్ సింగ్ సినిమాని ప్రకటించడం జరిగింది.

ఇక ఈ చిత్రం ప్రకటించి దాదాపుగా ఇప్పటికీ మూడు సంవత్సరాలు పైనే కావస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరిశంకర్ తెరకెక్కిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఎప్పుడు దొరుకుతాయా అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ డైరెక్టర్. హరిహర వీరమల్లు చిత్రం మాత్రం ఆగుతూ సాగుతూ ఉండడంతో హరిశంకర్ క్రేజీ ప్రాజెక్టు భవదీయుడు భగత్ సింగ్ పై ఎలాంటి అప్డేట్ కూడా లేకపోవడంతో అసలు ఈ సినిమా ఉన్నట్టా లేనట్టా అనే అనుమానాలను కూడా అభిమానులు సైతం సందేహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పట్ల భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్రాజెక్ట్ మొదలు పెట్టేది కష్టమని వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టు పై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాని ఎన్నికలు అయిపోయిన తర్వాత 2024లో చేద్దామని చెప్పినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఇదే కనుక నిజమైతే హరీష్ శంకర్ అర్జెంటుగా మరొక హీరో తో సినిమా చేసుకోవడం మంచిదని సూచనలు ఇస్తున్నారు ప్రేక్షకులు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తన తదుపరి చిత్రాల పరిస్థితి ఏంటా ఆని అభిమానులు చాలా సందిగ్ధంగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: