ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రైజ్'కి సీక్వెల్గా 'పుష్ప: ది రూల్' పేరుతో సీక్వల్ మూవీ రూపొందిస్తున్నారు సుకుమార్. ఇక తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.అయితే షూటింగ్ విషయంలో కాస్త ఆలస్యమైనా అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేసి ముందుకెళ్తున్నారు.ఇక మొదటి భాగంలో శ్రీవల్లిగా కనిపించి యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ రష్మిక మందన్న రోల్.. ఈ సినిమాలో మరింత అట్రాక్ట్ ఫుల్గా ఉండేలా సుక్కు జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ఇదిలావుండగా మొత్తానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ సెట్స్ మీదకొచ్చేసింది.ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఎదురుచూపులకు తెర దించుతూ ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ ప్రారంభించారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.అయితే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 షూటింగ్ మొదలైంది.ఇకపోతే ఓ ప్రత్యేకమైన సెట్ వేసి తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుతున్నారు. ఇక ఈ షెడ్యూల్ లో చిత్రంలోని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారట.అంతేకాదు ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించిన సీన్స్ లేకపోవడంతో ఆయన షూటింగ్ లో పాల్గొనలేదు.
ఇక ఇతర నటీనటులతో కొన్ని సీన్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే డిసెంబర్ నుంచి బన్నీ ఈ షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం.ఇకపోతే ఈ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కోసం పర్ఫెక్ట్ ప్లాన్స్ చేసిన సుకుమార్.. rrr రేంజ్లో ఓ స్కెచ్చేశారట.ఇక rrr సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పులితో చేసే ఫైటింగ్ సీన్ మరిచేలా ఓ పవర్ ఫుల్ సన్నివేశాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయించబోతున్నారట. ఇకపోతే అడవిలో పులితో పోరాడే ఈ సన్నివేశాన్ని థాయ్లాండ్ అడవుల్లో షూట్ చేయనున్నారట.అయితే ఇది సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది...!!