సాధారణంగా నటుల జీవితం అంత ఈజీ కాదు. వారి లైఫ్ స్టైల్ రీత్యా ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంటుంది. ఇక తీరిక లేని షెడ్యూల్స్, అసమయ భోజనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.అయితే హీరోలైతే ప్రమాదకర స్టంట్స్ చేయాల్సి ఉంటుంది.ఇక దీంతో అప్పుడప్పుడు ప్రమాదాల బారినపడుతూ ఉంటారు.ఇకపోతే కొన్ని స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన హీరోలు, నటులు కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ చాలా కాలంగా భుజం గాయంతో బాధపడుతున్నారట. ఇక సినిమాల్లోకి రాక ముందు విజయ్ దేవరకొండకు ఈ గాయమైందట.
అప్పుడప్పుడు ఇది బయటపడి ఇబ్బంది పెడుతుంది.కాగా లైగర్ మూవీ షూట్లో విజయ్ దేవరకొండ కు ఈ సమస్య తిరగబెట్టిందట.ఇక దర్శకుడు పూరి జగన్నాధ్ లైగర్ మూవీలో విజయ్ దేవరకొండ ని ప్రొఫెషనల్ ఫైటర్ గా చూపించాడు.కాగా ఫైటర్ రోల్ కోసం విజయ్ దేవరకొండ కొన్ని యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నాడు. అయితే భీకర పోరాట సన్నివేశాల్లో నటించారు. ఇక ఈ క్రమంలో ఆయన గాయం తీవ్రత పెరిగింది.ఇదిలావుంటే కొన్ని నెలలుగా విజయ్ దేవరకొండ చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఎట్టకేలకు గాయం నుండి కోలుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు.
ఇక విజయ్ దేవరకొండ ని దీర్ఘకాలంగా వేధిస్తున్న భుజం గాయం నుండి బయటపడ్డారని తెలుసుకొని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లైగర్ కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డారు. కఠిన కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ చేశారు.ఇక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. దుమ్మురేపే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ లైగర్ మూవీలో కథ, కంటెంట్ లేకపోవడంతో దారుణ పరాజయం చవి చూసింది.కాగా హైప్ నేపథ్యంలో భారీ ధరలకు విజయ్ దేవరకొండ లైగర్ హక్కులు దక్కించుకున్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. అయితే నష్టాలు తిరిగి చెల్లించే విషయంలో దర్శక నిర్మాత పూరితో బయ్యర్లకు వివాదం నెలకొంది..!!