ఎంత అందంగా ఉన్నా.. నటన ఉన్నా కొన్నిసార్లు టాలెంటెడ్ ఆర్టిస్టులు కూడా అవకాశాలు అందుకోవడం లో వెనక పడుతుంటారు.ఇక పట్టుమని పది సినిమాలు తీయకుండానే ఇండస్ట్రీలో కనపడకుండా పోతారు.అయితే దాంతో ప్రేక్షకులు నిరాశ చెందుతారు.ఇకపోతే మరి కొంతమంది హీరోయిన్స్ విషయానికి వస్తే.. కొన్నే మంచి సినిమాలు చేసినా.. అంతే మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. అంతేకాదు అలాగే ఆ సినిమాలకు అవార్డు కూడా అందుకుంటారు. అయినా కూడా అవకాశాలు ఉండవు.అయితే అలా నటించిన మొదటి సినిమాతో అన్ని భాషలలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ రితికా సింగ్.
ఇక ఈమె మొదటి సినిమా గురుతో వెంకటేష్ సరసన నటించింది.అయితే నిజానికి ఈమె హీరోయిన్ కావాలనుకోలేదట మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ కావాలనుకుందట.ఇక అలా 2009 ఆసియన్ ఇండోర్ గేమ్స్ పూర్తి చేసుకున్న రితిక ఆ తర్వాత మొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2013లో సూపర్ ఫైట్ లీగ్ లో పాల్గొన్న రితిక సింగ్ దర్శకురాలు సుధా కొంగర దృష్టిలో పడింది. ఇకపోతే చూడటానికి ఎంతో అందంగా ఉన్న రితిక.. అంతకంటే అందమైన ఆటను ఆడుతున్న రితికాను చూసి సినీ ఇండస్ట్రీలోకి లాగింది. సుధా సుధా కొంగర హిందీ మరియు తమిళంలో బాక్సింగ్ నేపథ్యంలో ఒక కథ రాసుకుంది.
ఆ కథలో మెయిన్ రోల్ బాక్సింగ్ పాత్రకు రితిక అయితే సరిపోతుందని భావించి సుధా ఆమెను ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేసింది. మాధవన్ మరియు రితిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ్ చిత్రం ఇది. కాగా ఈ సినిమా పేరు ఇరుదు సుత్రు అలాగే హిందీలో ఈ సినిమా పేరు ఖద్దూస్ అనే పేరుతో రూపొందించారు. అయితే అటు తమిళ్లో ఇటు హిందీలో బ్లాక్ బస్టర్ హిట్లను సాధించి రికార్డు తిరగరాసింది.కాగా తెలుగులో వెంకటేష్ తో గురు సినిమాలో నటించి తెలుగులో కూడా ఎంతో హిట్టును సాధించింది. ఇక ఇలా చాలా తక్కువ సమయంలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నా కూడా ఆ తరువాత రితికాకు మంచి అవకాశాలు రాలేదు.!