సమంత మరియు నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరి కెరియర్లలో కూడా ఎవరికి వారు బిజీ బిజీగా ఉన్నారు. సమంత అయితే వరుసగా సినిమాలు చేసింది.
నాగ చైతన్య కూడా వరుసగా నే సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. సమంత ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయినా కూడా నాగ చైతన్య కనీసం అయ్యో అని తన మాజీ భార్య గురించి సోషల్ మీడియా ద్వారా కూడా పోస్ట్ కూడా చేసిందే లేదు, పైగా సమంత కి పుండు మీద కారం చల్లినట్లుగా రెండవ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడంటూ పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయి.
నాగ చైతన్య తన రెండవ వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన ను చేసేందుకు సిద్ధమయ్యాడు అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత నటించిన యశోద సినిమా విడుదల రోజే నాగ చైతన్య తన రెండవ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తే మరింత మైలేజ్ వస్తుందని భావిస్తుండంటూ కొందరు అయితే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు నాగ చైతన్య పెళ్లి గురించి కానీ ప్రేమ గురించి కానీ క్లారిటీ అయితే లేదు కానీ నాగ చైతన్య కచ్చితంగా రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగుతోంది.
తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఒక బిజినెస్ మాన్ కూతురుతో నా చైతన్య రెండవ వివాహం జరగబోతుందని సమాచారం.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. అంతే కాకుండా నాగ చైతన్య తన యొక్క రెండవ పెళ్లి విషయాన్ని యశోద సినిమా విడుదల రోజే చెప్పాలను కోవడం కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటూ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారట.. అయితే నాగ చైతన్య నిజంగానే ఎంత పని చేస్తాడా అనేది చూడాలి. నాగ చైతన్య నిజంగా రెండవ పెళ్లి ప్రకటన చేస్తే అదో పెద్ద సంచలనంగా మారే అవకాశం అయితే ఉంది.