యశోద : ఫస్ట్ డే వసూళ్లు ఎలా ఉన్నాయంటే?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద సినిమా శుక్రవారం సౌత్ ఇండస్ట్రీలో భారీగానే విడుదల అయింది. ఇక హిందీలో కూడా కొన్ని లిమిటెడ్ థియేటర్లలో ఈ సినిమాని విడుదల చెయ్యడం జరిగింది.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఏ స్థాయిలో వసూళ్లను అందుకుందో పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక యశోద సినిమాను తెలుగులోనే కాకుండా హిందీ తమిళ మలయాళం భాషల్లో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా తెలుగులో మొదటి రోజు 3 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం తెలుస్తుంది.ఇక హిందీలో పది లక్షలు రాబట్టిన ఈ సినిమా తమిళంలో మరో 10 లక్షలు మలయాళం లో తొమ్మిది లక్షల వరకు వసూలు సాధించినట్లుగా సమాచారం తెలుస్తోంది.ఇక అటు ఇటుగా ఈ సినిమా ఇండియాలో 3 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఓవర్సీస్ లో చూసుకుంటే దాదాపు 80 లక్షలు రాబట్టిన యశోద సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా టోటల్ గా 3.50 కోట్లపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం తెలుస్తుంది.


అయితే తొలి రోజు ఒక రకంగా డీసెంట్ కలెక్షన్స్ అందుకున్నప్పటికీ కూడా పెట్టిన బడ్జెట్ కు అయితే ఈ లెక్క అసలు ఏమాత్రం కూడా సరితూగదు. శనివారం ఇంకా అలాగే ఆదివారం ఈ సినిమా కలెక్షన్స్ ఎంతో కొంత ఖచ్చితంగా పెరగాల్సిందే. లేకుంటే డిస్ట్రిబ్యూటర్స్ కు ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో నష్టాలు  కలిగే అవకాశం చాలా ఉంటుంది.ఎందుకంటే ఇక ఈ సినిమాకు దాదాపు 40 కోట్ల వరకు బడ్జెట్ అని చెప్పుకున్నారు. కానీ అసలు ఆ రేంజ్ లో అయితే సినిమాలో బడ్జెట్ పెట్టినట్లు కనిపించడం లేదు అని కూడా  టాక్ అయితే బాగా వినిపిస్తోంది. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఉదయం షోల కంటే సాయంత్రం నైట్ షోలకు కాస్త ఎక్కువ కలెక్షన్స్ పెంచుకుంది. ఫేమస్ సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను హరి హరీష్ అనే దర్శకులు తెరపైకి తీసుకువచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: