తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన
మాస్ ఇమేజ్ కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న
బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
మాస్ మహారాజ
రవితేజ హీరోగా తెరకెక్కిన భద్ర
మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను ప్రారంభించిన
బోయపాటి శ్రీను ఇప్పటివరకు తన కెరియర్ లో దర్శకత్వం వహించిన ప్రతి
మూవీ లోను అద్భుతమైన
మాస్ యాక్షన్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ దర్శకుడి కి
మాస్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం
బోయపాటి శ్రీను ,
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ ని కూడా
బోయపాటి శ్రీను అద్భుతమైన
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్
మూవీ గా తెరకెక్కించాడు. ఇది ఇలా ఉంటే అఖండ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని , ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టింది.