విడాకులపై క్లారిటీ ఇచ్చిన స్నేహ..!
ఈ వార్తలు స్నేహ చెవిన పడేసరికి ఎలాంటి రచ్చ చేయకుండా సైలెంట్ గా ఒకే ఒక ఫోటోతో పుకార్లకు చెక్ పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తెలుగులో స్టార్ హీరోయిన్ సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన స్నేహ పెళ్లి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది..ప్రసన్నతో కలిసి 2019లో అచ్చముండు అనే సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. ఇక అదే సమయంలో ఒకరికొకరు ఇష్టపడి, ప్రేమలో పడ్డారు. చివరికి 2012లో పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత స్నేహ కొంతకాలం సినిమాలకు దూరం అయింది. అప్పుడే వీరికి కొడుకు విహాన్, కూతురు ఆద్యంత జన్మించారు.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీయర్ని కొనసాగి స్తున్న స్నేహ.. మరొకపక్క ఈమె భర్త ప్రసన్న కూడా ఇండస్ట్రీలో నటులుగా కొనసాగుతున్నారు. ఇకపోతే ఉన్నట్టుండి సడన్గా విడాకులు విషయం బయటకు వచ్చేసరికి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ కూడా షాక్ అయింది. దీంతో తాము కలిసే ఉన్నామని, ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని, పుకార్లు నమ్మొద్దని క్లారిటీ ఇస్తూ ఒక పిక్ పోస్ట్ చేసింది. అందులో భర్త ప్రసన్న ను ముద్దాడుతూ వీకెండ్ ట్వినింగ్ అని ఒక పిక్ పెట్టింది. ఈ పిక్ తో రూమర్ అన్నిటికి పెట్టినట్లయింది. ఏమైనా ప్రస్తుతం స్నేహ , ప్రసన్నల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.