తెలుగు ప్రేక్షకులకు అల్లు అర్జున్ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. ఎన్నో హిట్ సినిమాల ను అందించి స్టార్ హీరో అయ్యాడు.. పుష్ప సినిమా కు ముందు వరకు ఈయన కేవలం దక్షిణాది సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే హీరోగా పేరు ప్రఖ్యాత లు పొందారు అయితే పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు గాను ఇప్పటికీ ఎన్నో అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా లో నటించినందు కు గాను ఈయన కు ఉత్తమ నటుడిగా సైమా అవార్డు ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. అదే విధంగా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను కూడా సొంతం చేసుకున్నారు. ఇలా ఈ అవార్డు ను సొంతం చేసుకున్న తొలి దక్షిణాది సినీ హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. ఇలా ఎన్నో అద్భుతమైన అవార్డుల ను అందుకున్నటువంటి ఈయన తాజాగా మరో అరుదైన గొప్ప అవార్డు కు ఎంపికయ్యారు.
తాజాగా అల్లు అర్జున్ ను ప్రతిష్టాత్మక GQ MOTY-2022 ‘ లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకి ఎంపికయ్యారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ను ఇప్పటివరకు ఏ తెలుగు హీరో కూడా అందుకోలేదు ఇలాంటి అవార్డు సొంతం చేసుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ మరొక రికార్డు సృష్టించారు. ఇక అల్లు అర్జున్ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపికయ్యారనే విషయం తెలియగానే అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఈ విషయం పై చర్చలు జరుగుతున్నాయి.. ప్రస్తుతం బన్నీ ఈ సినిమా సీక్వెల్ లో నటిస్తున్నాడు.. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..