ప్రస్తుతం తమిళ హీరో కార్తీ మంచి ఫాంలో వున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది తమిళ హీరో కార్తికు చాలా బాగా కలిసి వచ్చింది. ‘విరుమన్’, ‘Ps-1’, ‘సర్ధార్’ వంటి హ్యట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్లతో కోలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో కార్తీ కూడా చోటు దక్కించుకున్నాడు. ముఖ్యంగా పొన్నియిన్ సెల్వన్ సినిమా అయితే కార్తీకి చాలా పెద్ద భారీ హిట్టుని ఇచ్చింది. ఈ సినిమా దాదాపు 450 కోట్లపైగా వసూళ్లు సాధించి తమిళనాట ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఇక ప్రస్తుతం అదే జోష్‌తో ‘జపాన్’ అనే సినిమాని చేస్తున్నాడు. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది. ఈ చిత్రం హీరో కార్తీకి 25వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే తాజాగా చిత్రబృందం ఓ బిగ్ అప్డేట్‌ను ప్రకటించడం జరిగింది.ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నవంబర్ 14న అనగా రేపు సోమవారం నాడు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తీకి జోడీగా అను ఇమాన్యూయేల్ హీరోయిన్‌గా నటిస్తుంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా అలాగే ఈ చిత్రానికి రవివర్మన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక కార్తి ఇటీవలే ‘సర్దార్’తో చాలా పెద్ద విజయం సాధించాడు. పీ.ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్‌లను రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సినిమా హిట్టుతో కార్తీ కూడా తన అన్న సూర్య లాగే తమిళ స్టార్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. మరి జపాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.