ఏంటి.. యాంకర్ సుమ భర్త రాజీవ్.. ఆమె కంటే అంత పెద్దవాడా?
ఇక సుమ ఏదైనా షో చేసిందంటే చాలు ఆ షో తప్పకుండా సూపర్ హిట్ అవడం.. టాప్ రేటింగ్స్ రావడం ఖాయమని ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు. ఇకపోతే ఇక కేవలం బుల్లితెరపై కార్యక్రమాలు మాత్రమే కాదు అటు సినిమా ఈవెంట్లు కూడా చేస్తూ సుమ ఎప్పుడు బిజీ బిజీగా ఉంటుంది. ఇక సుమ కనకాలకు సంబంధించి ఏదైనా విషయం సోషల్ మీడియాలో వచ్చింది అంటే చాలు అది కాస్త నిమిషాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక గతంలో సుమ, రాజీవ్ కనకాల భార్యాభర్తలు విడిపోయారని విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు రాగా.. ఇక తాము కలిసి ఉన్న ఫోటోని పోస్ట్ చేసి ఇక ఈ పుకార్లకు చెక్ పెట్టారు ఇద్దరు.
ఈ క్రమంలోనే యాంకర్ సుమ ఆమె భర్త రాజీవ్ కనకాల మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అన్న విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సుమా, రాజీవ్ కనకాలకు 1999లో ప్రేమ వివాహం జరిగింది అన్న విషయం తెలిసిందే. రాజీవ్ కనకాల 1968లో నవంబర్ 13న జన్మించారు. ఇక ఇటీవల 53వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ క్రమంలో ఏంటి రాజీవ్ కనకాల ఇంత పెద్దవాడ అని అందరూ అవాక్కవుతున్నారు. యాంకర్ సుమ కంటే చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది అని భావిస్తున్నారు. ఎందుకంటే సుమ ఇంకా 30 ప్లస్ అన్నట్లుగానే కనిపిస్తూ చలాకీగా ఉంటుంది. కానీ నిజానికి సుమ ఏజ్ కూడా 47సంవత్సరాలు కావడం గమనార్హం.