షాక్: వెంకటేష్ అభిమానులకు నిరాశ.. వాటికి గుడ్ బై..!!

Divya
టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ చివరిగా ఓరి దేవుడా చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించారు. ఈ సినిమాతో సక్సెస్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ మాత్రం కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు వెంకటేష్, రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న రామానాయుడు వెబ్ సిరీస్ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే వెంకటేష్ సినిమాలకు కొంతకాలంగా బ్రేక్ తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆధ్యాత్మిక సాధన నేపథ్యంలోని వెంకటేష్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వార్త ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది.

కొంతకాలం బ్రేక్ తరువాత వెంకటేష్ మరొక కొత్త ప్రాజెక్టును ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇక నాగార్జున ఇప్పటికే ది ఘోస్ట్ సినిమా తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకుంటారని ప్రకటించారు. సీనియర్ హీరోలు వరుస సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటూ ఉండడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. వెంకటేష్ నటిస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నప్పటికీ తన సినిమాలు ఓటీటి లో విడుదలవ్వడంతో అభిమానుల సైతం కాస్త అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

ఇక వెంకటేష్ తన తదుపరి చిత్రాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానుల సైతం భావిస్తున్నారు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ వెంకటేష్ కెరియర్ కొనసాగిస్తూ ఉన్నారు.వెంకటేష్ ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.13 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో వెంకటేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారు అనే వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి.ఈ విషయంపై వెంకటేష్ కూడా ఎప్పుడు స్పందించలేదు. కానీ ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం కాస్త నిరుత్సాహ పడుతున్నారు. ఏది ఏమైనా ఇతర హీరోల కంటే వెంకటేష్ కెరియర్ చాలా సాఫీగానే సాగుతోంది మరి ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం సరైనది కాదు అని కొంతమంది నేటిజెన్లు, అభిమానులు  కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: