అన్ స్టాపబుల్ సీజన్ 2 కు ఆ సీనియర్ స్టార్ హీరోయిన్..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న బాలకృష్ణ ప్రస్తుతం సినిమా లతో పాటు ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 1 విజయవంతంగా పూర్తి అయింది. ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 కొనసాగుతోంది.

ఆన్ స్టాపబుల్ సీజన్ 2 లో భాగంగా ఇప్పటికే మూడు ఎపిసోడ్ లు కూడా విడుదల అయ్యాయి. అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కు బాలకృష్ణ , లోకేష్ ముఖ్య అతిథులుగా విచ్చేయగా , రెండో ఎపిసోడ్ కు విశ్వక్ సేన్  సిద్దు జొన్నలగడ్డ లు విచ్చేశారు. మూడవ ఎపిసోడ్ కు శర్వానంద్ , అడవి శేష్ లు విచ్చేశారు.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాలుగవ ఎపిసోడ్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... అండ్ స్టాపబుల్ సీజన్ 2 లో భాగంగా ఒక ఎపిసోడ్ కు సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక రాబోతున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఆన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రస్తుతం అద్భుతమైన రేంజ్ లో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: