మహేశ్​ కాకుండా కృష్ణకు నచ్చిన ఈ తరం హీరో ఎవరో తెలుసా..?

Anilkumar
వెండితెరపై  ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా ముందడుగు వేశారాయన. ఇక ఆయన మరెవరో కాదు లెజెండరీ హీరో కృష్ణ. అలానే ఆయన తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్బాబు కూడా సూపర్స్టార్గా ఎదిగి కెరీర్లో దూసుకెళ్తున్నారు. అయితే విశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు.ఇక  తండ్రి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నారు. ఆయన నటనను చూసి కృష్ణ ఎప్పుడూ మురిసిపోతుంటారు. అయితే ఇక  మహేశ్ కాకుండా ఈ తరం హీరోల్లో తనకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు కృష్ణ. 

ఆ సంగతులు...ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రామ్చరణ్.. వీరిలో ఎవరంటే ఇష్టమని అడగగా.. జానియర్ ఎన్టీఆర్ అని టక్కున చెప్పారు సూపర్స్టార్. ఇక మంచి నటుడని కితాబిచ్చారు. అంతేకాదు అలానే సీనియర్ ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇకపోతే అల్లూరి సీతారామరాజు మూవీ సమయంలో తనకు, సీనియర్ ఎన్టీఆర్కు మధ్య దాదాపు పదేళ్ల పాటు మాటలు లేవని తెలిపారు. ఇక "నేను అల్లూరి సినిమా తీసిన తర్వాత కూడా ఎన్టీఆర్ ఆ చిత్రాన్ని చేయాలని అనుకున్నారు. అందుకోసం పరుచూరి బ్రదర్స్ను కథ రాయమని అడిగారు. 

అయితే పరుచూరి బ్రదర్స్.. కృష్ణ అల్లూరి సినిమా చూశారా అని అడిగారట.అయితే  అప్పుడు ఎన్టీఆర్ చూడలేదు అంటే.. ఓ సారి చూడండి అని సలహా ఇచ్చారట. ఇక అప్పటికే నాకు ఎన్టీఆర్కు దాదాపుగా పదేళ్లు మాటల్లేవు. ఒకరోజు అనుకోకుండా స్టూడియోలో ఎదురుపడ్డాం. ఇక  'బ్రదర్ ఇలా రండి' అని నన్ను పిలిచారు. ఏంటి అని అడిగితే మీ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని చూడాలనుకుంటున్నా. మీరే దగ్గరుండి చూపించాలి అని అడిగారు. అయితే వెంటనే ప్రింట్ తెప్పించి పక్కనే కూర్చుని చూపించా. ఇక ఇంటర్వెల్కే అద్భుతంగా ఉందని అన్నారు.  సినిమా మొత్తం అయిపోయాక నన్ను కౌగిలించుకుని ప్రశంసించారు.ఇక  ఈ సినిమాని ఇంతకంటే బాగా ఎవరూ తీయలేరు అని కితాబిచ్చారు." అని కృష్ణ గుర్తుచేసుకున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: