కృష్ణ అసలు పేరు ఏంటో మీకు తెలుసా..!?

Anilkumar
ఘట్టమనేని కృష్ణ (80) ఇక లేరు. ఇక అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.ఇకపోతే కార్డియాక్‌ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే.. సూపర్‌స్టార్‌ కృష్ణ 1942 మే 31 న గుంటూరు జిల్లాలో జన్మించారు. ఇక తెనాలి తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామం ఆయన స్వస్థలం.కాగా  ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా జన్మించాడు.అయితే  ఆయనది రైతు కుటుంబం. 

తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి. సినీరంగ ప్రవేశం తర్వాత ఆదుర్తి సుబ్బారావు ఆయన పేరును కృష్ణగా కుదించాడు. ఇక చిన్నతనం నుంచి కృష్ణకు ఎన్‌టీఆర్‌ అభిమాన నటుడు. కృష్ణకు ఎన్టీఆర్‌ నటించిన నటించిన చిత్రాల్లో పాతాళ భైరవి అభిమాన చిత్రం.ఇకపోతే  తల్లిదండ్రులకు కృష్ణ పెద్ద కొడుకు. ఆయనకు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు.అయితే  తల్లిదండ్రులకు కృష్ణను ఇంజినీర్‌ను చేయాలన్న కోరిక ఉండేది.ఇక అందుకోసం ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ సీటు కోసం ప్రయత్నించి, గుంటూరు కళాశాలలో దొరకకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎంపీసీ గ్రూపులో ఇంటర్ చేరారు.

అయితే  అక్కడ మూడు నెలలే చదివి, ఏలూరులోని సీఆర్‌రెడ్డి కళాశాలకు మారారు. ఇక అక్కడే ఇంటర్మీడియట్ పూర్తిచేసి తర్వాత బీఎస్సీ పూర్తి చేశారు.కాగా సీఆర్‌రెడ్డి కళాశాలలో కృష్ణ, తర్వాతి కాలంలో సినిమాల్లో నటునిగా ఎదిగిన మురళీమోహన్ క్లాస్‌మేట్‌తో పాటు మంచి స్నేహితులు. అయితే కృష్ణ డిగ్రీ చదువుతూండగా ఏలూరులో అప్పటికే నటుడిగా మంచి గుర్తింపు పొందిన అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది.ఇక  ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావడంతోనే ఆ స్థాయిలో ప్రజాభిమానాన్ని చూసి తాను సినిమా హీరో కావాలని నిర్ణయించుకున్నారు.కాగా  తర్వాత డిగ్రీ పూర్తి చేశాకా ఇంజినీరింగ్‌ కోసం ప్రయత్నించినా కృష్ణకు సీటు రాలేదు. ఇక దాంతో కృష్ణ విద్యార్థి జీవితం ముగిసింది.అయితే  అనంతరం సినిమాల్లో నటించాలన్న తన కలను తండ్రి దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన అనుమతి చెన్నైకి వెళ్లారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: