తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించి శృతి హాసన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా శృతి హాసన్ వరుస విజాయలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు కొనసాగిస్తుంది.
శృతి హాసన్ వరుసగా వకీల్ సాబ్ , క్రాక్ మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి మూవీ లో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ మూవీ ని 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. గోపీచంద్ మాలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు మూవీ లతో పాటు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలర్ లో కూడా ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లు కనక బ్లాక్ బాస్టర్ విజయాలు సాధించినట్లు అయితే శృతి హాసన్ రేంజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది.