"తునీవు" ఆల్బమ్ కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సంగీత దర్శకుడు..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎలా ఉంటే తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి ,  అందులో కొన్ని మూవీ లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని , ఈ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. అజిత్ ఆఖరుగా హెచ్ వినోద్ దర్శకత్వం లో తెరకెక్కిన వలిమై అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టినప్పటికీ , మిగతా భాషలలో మాత్రం ఆశించిన రేంజ్ కలెక్షన్ లను రాబట్ట లేక పోయింది.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అజిత్ ,  హెచ్ వినోద్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తునివు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి జీబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ సంగీత దర్శకుడు జీబ్రాన్ ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ కు సంబందించిన క్రేజీ న్యూస్ ను తెలియజేశాడు. తాజాగా జీబ్రాన్ మాట్లాడుతూ ... తునీవు మూవీ సాంగ్స్ పక్క మాస్ గా ఉంటాయి. అజిత్ సర్ అభిమానులు ఊహించినట్లుగానే ఈ మూవీ సాంగ్స్ డాన్స్ సాంగ్స్ లా ఉంటాయి అని జీబ్రాన్ తాజాగా చెప్పుకచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: