"వాల్తేరు వీరయ్య" మూవీకి సంబంధించిన ఆ పనులను ప్రారంభించిన చిరంజీవి..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా , శృతి హాసన్ ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా , రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని నిర్మిస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం టైటిల్ టీజర్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.


ఈ టైటిల్ టీజర్ అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన పనులను వేగవంతం చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో మూవీ యూనిట్ జరుపుతుంది. అలాగే ఒక వైపు ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగానే , మరో వైపు ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి.


అందులో భాగంగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మూవీ డబ్బింగ్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి అని తెలియడంతో ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: