సంక్రాంతి పండగ వచ్చింది అంటే
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే.
సంక్రాంతి పండుగ కు
టాలీవుడ్ స్టార్స్ హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే
సంక్రాంతి కి తమ సినిమాలను విడుదల చేసే విధంగా
సినిమా షూటింగ్ లను కూడా స్టార్ హీరోలు ప్లాన్ చేస్తూ ,
సంక్రాంతి కి
మూవీ లను విడుదల చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఈసారి
సంక్రాంతి కి కూడా
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ వాతావరణం కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే
టాలీవుడ్ సీనియర్ స్టార్
హీరో అయినటు వంటి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా
బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ
మూవీ తో పాటు
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి నందమూరి నటసింహం
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర
సింహా రెడ్డి
మూవీ ని కూడా వచ్చే సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇలా ఇప్పటికే
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు వచ్చే సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల అవుతూ ఉండగా ,
తమిళ హీరో దళపతి విజయ్ హీరోగా తేరకెక్కిన డబ్బింగ్
మూవీ వారసుడు ను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ
మూవీ ని దిల్ రాజు నిర్మించాడు. ఇది ఇలా ఉంటే
చిరంజీవి ,
బాలకృష్ణ హీరోలుగా నటించిన సినిమాల కంటే ఎక్కువ
థియేటర్ లను దిల్ రాజు "వారసుడు"
మూవీ కి కేటాయిస్తున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వాల్తేరు వీరయ్య , వీర సింహారెడ్డి
మూవీ లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.