నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం అఖండ మూవీ తో అద్భుతమైన విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా , ప్రగ్యా జైస్వాల్ ఈ మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. పూర్ణ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , శ్రీకాంత్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ విజయం లో తమన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది.
అఖండ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లbకు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టి పోయిన సంవత్సరం బ్లాక్ బాస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా , దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వీర సింహా రెడ్డి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ లో మొత్తంగా చిన్న పెద్ద అన్ని కలిపి మొత్తం 11 యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.