పెళ్లి పై వస్తున్న వార్తలపై గట్టి కౌంటర్ ఇచ్చిన తమన్నా..!!

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్  తమన్న ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 సంవత్సరాల పైగానే అవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉండడం గమనార్హం.  కొద్ది రోజుల నుంచి ఈమె కెరియర్ లో పెద్దగా హిట్ అందుకోలేకపోతుందని చెప్పవచ్చు.ఇటీవల ఈమె నటించిన సీటీమార్, F3, బబ్లీ బౌన్సర్ ఇలా అన్ని సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఇక దీంతో ఈమె కెరియర్ ముగిసిపోయింది త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు ఇక  తమన్నా వివాహం చేసుకోబోయే అబ్బాయి అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించడం గమనార్హం.

ఇకపోతే తమన్నా ఆ అబ్బాయిని ఆస్తి కోసమే వివాహం చేసుకుంటోంది. అయితే అతడు ఒక పెద్ద బిజినెస్ మాన్ కావడంతో పెళ్లికి అంగీకరించిందని, వీరిది అరేంజ్డ్ మ్యారేజ్ అని పెద్దలు కుదిర్చిన పెళ్లి అని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ వార్తలు తమన్న వరకు చేరినట్లు తెలుస్తోంది.ఇదిలావుంటే  తాజాగా  వీటిపై స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చింది తమన్నా.. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన మ్యారేజ్ గురించి రూమర్లు రాసిన వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఇక ఇతనే నా భర్త బిజినెస్ మాన్ ' అంటూ ఇటీవల తాను నటించిన ఎఫ్ 3 సినిమాలోని పాత్రకు సంబంధించిన వీడియో క్లిప్ ను కూడా జత చేసింది.  

మ్యారేజ్ రూమర్స్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జత చేసింది ఈ ముద్దుగుమ్మ. తమన్నా ఎఫ్3 సినిమాలో కొన్ని సన్నివేశాలలో మగాడివేషంలో కనిపించిన విషయం తెలిసిందే.  ఈ వీడియో క్లిప్ ని షేర్ చేసి పెళ్లి రూమర్ లు వ్యాపింప చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు.ఈమె సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సత్యదేవ్ తో కలిసి 'గుర్తుందా శీతాకాలం 'అనే సినిమాలో నటిస్తోంది.ఇదిలావుంటే  మరొకవైపు 'భోళా శంకర్' చిత్రంలో కూడా మెగాస్టార్ సరసన నటిస్తోంది.ఇక  దీంతోపాటు పలు హిందీ , తమిళ్ , మలయాళం సినిమాలు కూడా ఈమె లిస్టులో ఉన్నాయి. ఇంత బిజీగా ఉండే తమన్న పై ఇలాంటి వార్తలు రావడంతో ఆమె మరింత ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తాను మాట్లాడుతూ.. తాను ఎవరిని పెళ్లి చేసుకోవాలో తన తల్లిదండ్రులు నిర్ణయిస్తారని.. కూడా చెప్పుకొచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: