మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్
బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి
సమంత తాజాగా యశోద అనే
మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ సస్పెన్స్
థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. లేడీ ఓరియంటెడ్
మూవీ గా రూపొందిన ఈ
మూవీ కి
హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా , మెలోడీ బ్రహ్మ
మణిశర్మ ఈ
మూవీ కి సంగీతం అందించాడు.
ఉన్ని ముకుందన్ ,
వరలక్ష్మి శరత్ కుమార్ ,
రావు రమేష్ ,
మురళీ శర్మ ఈ
మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ
మూవీ విడుదలకు ముందు ఈ
సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో యశోద
మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ యశోద
సినిమా నవంబర్ 11 వ తేదీన తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది.
ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ టాక్ రావడం తో ప్రస్తుతం ఈ
మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి
మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ
సినిమా విజయంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఈ
మూవీ విడుదలకు ముందు ఈ
సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ
సినిమా విడుదల తర్వాత కూడా ఈ
మూవీ పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ నుండి "బేబీ షవర్" వీడియో సాంగ్ ను ఈ
మూవీ యూనిట్ విడుదల చేసింది. మరి ఈ వీడియో సాంగ్ లు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.