ఈటీవీ లో ప్రసారం అవుతున్న
జబర్దస్త్ కామెడీ షో ద్వారా అద్భుతమైన క్రేజీ ను , ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న
సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
సుడిగాలి సుదీర్ "జబర్దస్త్"
కామెడీ షో తో పాటు , అనేక
టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా అనేక
సినిమా లలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా
సుడిగాలి సుదీర్ "గాలోడు" అనే పవర్ఫుల్
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ!లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ
మూవీ కి
రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వం వహించాడు. అలాగే ఈ
మూవీ ని
సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఈయనే నిర్మించాడు. ఈ
మూవీ లో
సుడిగాలి సుదీర్ సరసన గేహనా సిప్పీ
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ ని రేపు అనగా
నవంబర్ 18 వ తేదీన
థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మరియు పాటలను కూడా విడుదల చేసింది. ఈ
మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు , పాటలకు ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే రేంజ్ లో రెస్పాన్స్ లభించింది. దానితో ఈ
మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. మరి ఈ
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎన్ని
థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.
నైజాం : 130 ప్లస్ .
సీడెడ్ : 60 .
ఆంధ్ర : 185 ప్లస్ .
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి గాలోడు
మూవీ 375 ప్లస్
థియేటర్ లలో విడుదల కాబోతుంది.