నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ఇక ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఇదిలావుంటే ఇక బాలకృష్ణ స్టార్ హీరో అయినప్పటికీ కూడా తనలో ఉన్న కొన్ని అలవాట్లు మాత్రం ఇంకా మార్చుకోలేదట.ఇక ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే బాలకృష్ణకు పేకాట ఆడే అలవాటు ఉందని ఆయన అభిమానుల్లో చాలామందికి ఈ విషయం తెలియదు.ఈ విషయాన్ని తాజాగా డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పకొచ్చారు.
ఇక నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నేను బాలకృష్ణ నటించిన ఓ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాను. అయితే ఆ టైంలో బాలకృష్ణ నాతో సరదాగా ఉండేవారు. అంతేకాదు అలాగే ఓ టాప్ హీరో సినిమా షూటింగ్ టైంలో బాలకృష్ణ గారు నన్ను మీకు పేకాట ఆడ వచ్చా అని అడిగారు. వచ్చు అని చెప్పగానే నాతో పేకాట ఆడడం మొదలుపెట్టారు.పేకాట ఆడి పది రూపాయలు పోగొట్టుకున్నాడు. కొద్దిసేపు అయ్యాక నేను వెళ్తాను సార్ అని ఎంత చెప్పినా వినలేదు.8కె నువ్వు ఆడాల్సిందే అని బాలయ్య పట్టుబట్టారు అంటూ జి. నాగేశ్వర్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అయితే ఇది చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అని కూడా చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ బాలకృష్ణ ఇంకా పేకాట అలవాటు మర్చిపోలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో సీజన్ 2 కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. షో కి వచ్చే గెస్ట్ ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అభిమానుల మెప్పు పొందుతున్నారు. అయితే ఇక చాలామంది ఇండస్ట్రీ జనాలు బాలకృష్ణకు చాలా కోపం అని చెప్పుకొస్తారు.బాలకృష్ణకు అంత కోపమే ఉంటే ఆయనతో కలిసి నటించిన హీరోయిన్లు మళ్ళీ మళ్ళీ ఆయనతోనే పని చేయాలని ఎందుకు అనుకుంటారు అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు..!!