ఈర్ష... ద్వేషాలకు దూరంగా ఉండండి... అజిత్..!

Pulgam Srinivas
తమిళ్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటు వంటి అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ తాజాగా వలిమై అనే మూవీ లో హీరోగా నటించాడు. హెచ్ వినోద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తమిళ్ తో పాటు తెలుగు , హిందీ , మలయాళ , కన్నడ భాషలలో ఒకే రోజు భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ లో యాక్షన్స్  సన్ని , బైక్ స్టంట్ సన్నివేశాలు బాగున్నప్పటికీ కథా అంతగా గ్రిప్పింగ్ లేకపోవడంతో వలిమై సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేయలేక పోయింది. వలిమై సినిమా ఇతర భాషలతో పోలిస్తే తమిళ భాషలో కాస్త ఎక్కువ కలెక్షన్ లనే రాబట్టింది. ఈ మూవీ లో టాలీవుడ్ యువ నటులలో ఒకరు అయినటు వంటి శివ కార్తికేయన్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. విలన్ పాత్రలో శివ కార్తికేయన్ నటనకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.


ఇది ఇలా ఉంటే అజిత్ ప్రస్తుతం తునీవు అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి అజిత్ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి హెచ్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అజిత్ తన అభిమానుల కోసం ఒక ప్రకటన విడుదల చేశాడు. ఎల్లప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించే వారిని మీ చుట్టూ ఉంచుకోవాలి. నెగిటివిటీకి దగ్గరకి రానీయద్దు అని అజిత్ సూచించాడు. ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని దానిని సాధించేందుకు ముందుకు సాగండి. పాజిటివ్ ఎనర్జీతో మంచి కాలాలు వస్తాయి. ఈర్ష  ,  దేశాలకు చాలా దూరంగా ఉండండి. ఒకరిని ఒకరు మంచిగా చూడండి సంతోషంగా జీవించండి అని అజిత్ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: