వారసుడు మూవీ వివాదం బాగా ముదిరిపోతుంది. టాలీవుడ్-కోలీవుడ్ మధ్య లోకల్-నాన్‌లోకల్ యుద్ధం జరుగుతుంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ మూవీ సంక్రాంతి రిలీజ్‌పై రగడ రాజుకుంది.డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయొద్దంటూ తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖ విడుదల అవ్వడంతో ఈ వివాదం ఇంకా ఎక్కువయ్యింది. ఈ మూవీ మేకర్స్ వంశీ పైడిపల్లి, దిల్ రాజు, దర్శక నిర్మాతలుగా, విజయ్ హీరోగా వస్తున్న వారసుడు మూవీ విడుదలకు ముందు నుంచే వివాదాలు రేపుతుంది.తెలుగు సినిమాలు తమిళనాడులో ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదల అవుతోంటే…తెలుగులో అభ్యంతరాలపై మండి పడుతున్నారు తమిళ సినీ దర్శకులు. ఇక ఈ సినిమాకి దర్శక, నిర్మాతలు ఇద్దరూ కూడా తెలుగు వారే..ఒక్క హీరో మాత్రమే తమిళ నటుడు. అంతమాత్రాన అడ్డుకుంటారా? అంటూ తెలుగు సినీ నిర్మాతల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు తమిళ మూవీ మేకర్స్. తెలుగులో కనుక బ్రేకులేస్తే… తమిళంలో చుక్కలు చేపిస్తామంటూ హెచ్చరిస్తోంది తమిళ సినీ ఇండస్ట్రీ.
మహేష్ బాబు సినిమాలు, బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ తమిళనాడులో బాగా ఆడి మంచి హిట్ అవుతున్నాయి. తమిళ దర్శకులు తీసే సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యి కూడా బాగా ఆడుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఇలా చేస్తే తెలుగు సినిమాలను తమిళనాడులో బాయ్ కాట్ చేస్తామంటూ పొలిటిషియన్ సీమన్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ చిత్రసీమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఏం చేస్తోందంటూ కోపం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా తెలుగులో వారసుడుగా తమిళంలో వారిసు గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతికి గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటన కూడా చేసింది. కానీ అంతలోనే తెలుగు నిర్మాతలు ఈ సినిమాకి పెద్ద షాకిచ్చారు. దీంతో టాలీవుడ్-కోలీవుడ్ మధ్య రగడ అనేది జరుగుతుంది. మరి చూడాలి ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో..