తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమా లలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్న తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తేజ సజ్జ సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్న విషయం మనకు తెలిసింది. అందులో భాగంగా ఇప్పటికే తేజా సజ్జ పలు మూవీ లలో హీరో గా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తేజ సజ్జ "హనుమాన్" మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో జాంబి రెడ్డి అనే మూవీ తెరకెక్కింది. జాంబీ రెడ్డి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోవడం మాత్రమే కాకుండా మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది.
ఈ మూవీ తో తేజ సజ్జ కు ప్రశాంత్ వర్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇలా ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జాంబీ రెడ్డి మూవీ మంచి విజయం సాధించడంతో హనుమాన్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ టీజర్ ను నవంబర్ 21 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. హనుమాన్ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.