9 రోజుల్లో "యశోద" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో మూవీ లలో ఎన్నో పాత్ర లలో నటించిన సమంత ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత "యశోద" అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నవంబర్ 11 వ తేదీన మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.


ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ రావడం తో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 9 రోజుల్లో యశోద మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


నైజాం : 3.72 కోట్లు .
సీడెడ్ : 71 లక్షలు .
యు ఏ : 98 లక్షలు .
ఈస్ట్ : 45 లక్షలు .
వెస్ట్ : 27 లక్షలు .
గుంటూర్ : 48 లక్షలు .
కృష్ణ : 52 లక్షలు .
నెల్లూర్ : 23 లక్షలు .
9 రోజుల్లో యశోద మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.35 కోట్ల షేర్ , 12.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
తమిళ్ :  1.00 కోట్లు .
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో :  1.10 కోట్లు .
ఓవర్ సీస్ లో :  2.52 కోట్లు .
9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా యశోద మూవీ 11.97 కోట్ల షేర్ , 25.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: