తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి అల్లరి నరేష్ తాజాగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించగా , ఆనంది ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని నవంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. దానితో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలాగే నాంది లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత అల్లరి నరేష్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై సాధారణ సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇది ఇలా ఉంటే నవంబర్ 25 వ తేదీన తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి విష్ణు విశాల్ హీరో గా తెరకెక్కిన మట్టి కుస్తీ మూవీ కూడా విడుదల కాబోతుంది. ఈ మూవీ ని రవితేజ సమర్పిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదల అయిన "ఎఫ్ ఐ ఆర్" మూవీ తో విష్ణు విశాల్ తెలుగు సినీ ప్రేమికులను పలకరించాడు. కాకపోతే ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మట్టి కుస్తీ మూవీ ని తెలుగు లో కూడా భారీ ఎత్తున నవంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ అల్లరి నరేష్ "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" మూవీ తో పోటీపడి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.